Header Banner

ప్రధాని మోదీకి, పీఎంవోకు కృతజ్ఞతలు.. సోషల్ మీడియా ద్వారా స్పందించిన పవన్ కల్యాణ్!

  Sun Apr 13, 2025 14:47        Politics

సింగపూర్‌లో తన కుమారుడు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం బారినపడగా, తక్షణమే స్పందించి సహాయం అందించారంటూ ప్రధానమంత్రి రేంద్ర మోదీకి, పీఎంవోకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ అధికారులు, సింగపూర్ లోని భారత హైకమిషన్ కార్యాలయం సమన్వయంతో అందించిన సహాయం కష్ట సమయంలో ఎంతో భరోసానిచ్చిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతంలో 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో పాల్గొని, ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తుండగా ఈ బాధాకరమైన వార్త తనకు అందిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తన కుమారుడికి, ప్రమాదంలో చిక్కుకున్న ఇతర పిల్లలకు సకాలంలో సహాయం అందించడం ద్వారా తన కుటుంబానికి ఎంతో ధైర్యం, ఉపశమనం లభించిందని అన్నారు. "ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల జీవితాలను మెరుగుపరచడానికి మీకున్న దార్శనిక నిబద్ధతకు అడవి తల్లి బాట నిదర్శనం. ఈ వర్గాల అవసరాలను పరిష్కరించడానికి మీరు తీసుకున్న అనేక చర్యలలో ఇది ఒకటి.

 

ఇది కూడా చదవండి: తితిదేపై వైకాపా నేత భూమన అసత్య ప్రచారం! ఆయనపై చట్టపరమైన చర్యలు..

 

వారి జీవితాలను మార్చేందుకు మీరు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఇది కీలకమైన భాగం. పీఎం జన్ మన్, పీఎం జీఎస్ వై, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సహాయంతో, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1,069 కిలోమీటర్ల మేర రోడ్లను రూ.1,005 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇది 601 బలహీన గిరిజన సమూహాల ఆవాసాల్లో కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గిరిజన ప్రాంతాల్లో రవాణాను మెరుగుపరుస్తుంది, పర్యాటకానికి మద్దతు ఇస్తుంది, సకాలంలో వైద్య సహాయం అందిస్తుంది, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న 'డోలీ' కష్టాలకు ముగింపు పలుకుతుంది" అని ప్రధాని మోదీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli